ఐక్యంగా ఉంటే విజయం మనదే..

ఐక్యంగా ఉంటే విజయం మనదే..

తెలంగాణ కాంగ్రెస్‌ నేతలతో కాంగ్రెస్‌ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ ఢిల్లీలో ఇవాళ సమావేశమయ్యారు. కాంగ్రెస్‌ వార్‌రూమ్‌లో ఏర్పాటు చేసిన ఈ సమావేశంలో రాష్ట్ర వ్యవహారాల ఇన్‌ఛార్జి కుంతియా, టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, జానారెడ్డి, భట్టి విక్రమార్క, రేవంత్‌రెడ్డి, డీకే అరుణ, కోమటిరెడ్డి సోదరులు, షబ్బీర్‌ అలీ, పొన్నాల లక్ష్మయ్య తదితరులు పాల్గొన్నారు. పొత్తులు, అభ్యర్థుల ఎంపిక, పార్టీలో చేరికల వ్యవహారంపై చర్చించారు. ఈ సందర్భంగా రాహుల్‌ మాట్లాడుతూ తెలంగాణలో పార్టీ పరిస్థితి మెరుగ్గా ఉందని.. అందరూ కలిసికట్టుగా పని చేయాలని సూచించారు. ఐక్యంగా పని చేస్తే విజయం తమదేనన్నారు. 'మీలో ఎన్ని అభిప్రాయ బేధాలు ఉన్నా.. పార్టీ వేదిక మీద చర్చించుకోండి. మీడియా ముందు మాట్లాడి వివాదాలకు పోవద్దు' అని సూచించారు.