ఇకపై పత్రికల్లో రైల్వే టెండర్ ప్రకటనలు ఉండవు

ఇకపై పత్రికల్లో రైల్వే టెండర్ ప్రకటనలు ఉండవు

దిన పత్రికలు, మ్యాగజైన్లలో టెండర్ ప్రకటనలు ఇవ్వడం ఆపేయాలని రైల్వే బోర్డు నిర్ణయం తీసుకుంది. రైల్వే శాఖ అన్ని పనులకు ఈ- టెండర్లు ఆహ్వానిస్తున్నప్పుడు ప్రత్యేకంగా వార్తాపత్రికలు, మ్యాగజైన్లలో తిరిగి ప్రకటనలు ఇవ్వడం అనవసరమని అభిప్రాయపడింది. దీని ద్వారా రైల్వేలు చేస్తున్న ఖర్చు గణనీయంగా తగ్గుతుందని తెలిపింది. వెబ్ సైట్ లో టెండర్ వివరాలు ఉంచిన తేదినే టెండర్ పబ్లిషింగ్ చేసిన తేదిగా భావించాలని కోరింది. టెండర్లు తెరిచేందుకు తీసుకునే కనీస సమయం కూడా ఇందుకు అనుగుణంగానే ఉంటుందని రైల్వే బోర్డు ఉత్తర్వులు జారీ చేసింది