ట్వంటీ ట్వంటీపై కన్నేసిన రాజమౌళి

ట్వంటీ ట్వంటీపై కన్నేసిన రాజమౌళి

ఎస్.ఎస్‌.రాజ‌మౌళి ప్ర‌తిష్ఠాత్మ‌క చిత్రం RRR రిలీజ్ ఎప్పుడు? ఇంత‌కాలం అస్స‌లు క్లారిటీనే లేదు. అస‌లు ఈ సినిమా ఎప్పుడు మొద‌లు పెడ‌తారు? అన్న‌దానికి ద‌ర్శ‌క‌నిర్మాత‌లెవ‌రూ క‌నీసం క్లూ కూడా ఇవ్వ‌లేదు. మ‌రోవైపు ఎన్టీఆర్‌, చ‌ర‌ణ్ అభిమానులు ఎంతో ఉత్కంఠ‌గా ఈ ప్రాజెక్ట్ కోసం ఎదురు చూస్తున్నారు. 

తాజా అప్‌డేట్ ప్ర‌కారం.. హైద‌రాబాద్ అల్యూమినియం ఫ్యాక్ట‌రీ ప‌రిస‌రాల్లో రెండ‌క‌రాలు లీజుకు తీసుకుని అందులో సెట్స్ నిర్మించేందుక యూనిట్ రెడీ అవుతోంది. క‌ళా ద‌ర్శ‌కుడు సాబు సిరిల్ సార‌థ్యంలో సెట్స్ వేసేందుకు రంగం సిద్ధం చేసుకున్నార‌ని తెలుస్తోంది. న‌వంబ‌ర్‌లో చిత్రీక‌ర‌ణ మొద‌లు పెట్ట‌నున్నారు. 2020లోనే ఈ సినిమాని రిలీజ్ చేసే ఆస్కారం ఉంద‌ని చెబుతున్నారు. న‌వంబ‌ర్ నాటికి `అర‌వింద స‌మేత` రిలీజై తార‌క్ అందుబాటులోకి వ‌స్తాడు. అప్ప‌టికి చ‌ర‌ణ్ - బోయ‌పాటి సినిమా పూర్త‌వుతుంది. తార‌క్ - చ‌ర‌ణ్ అందుబాటులోకి రాగానే రాజ‌మౌళి సినిమా ప్రారంభిస్తాడు. ఇక స్క్రిప్టు విష‌య‌మై గుణ్ణం గంగ‌రాజు- విజ‌యేంద్ర ప్ర‌సాద్ బృందం ఇంకా వ‌ర్క్ చేస్తూనే ఉన్నార‌ని తెలుస్తోంది. ఇప్ప‌టికే ఈ ప్ర‌తిష్ఠాత్మ‌క చిత్రానికి 300 కోట్ల బ‌డ్జెట్‌ని వెచ్చిస్తామ‌ని డివివి ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ అధినేత దాన‌య్య ప్ర‌క‌టించారు.