రాజస్థాన్ టార్గెట్ 169 రన్స్

రాజస్థాన్ టార్గెట్ 169 రన్స్

ఐపీఎల్‌లో భాగంగా ఈ రోజు జరుగుతున్న రెండో మ్యాచ్‌లో ముంబైలోని వాంఖడే స్టేడియం వేదికగా ముంబై ఇండియన్స్, రాజస్థాన్ రాయల్స్ తలపడుతున్నాయి. టాస్ గెలిచి రాజస్థాన్  ఫీల్డింగ్ ఎంచుకోవడంతో మొదట బ్యాటింగ్ చేసిన ముంబై నిర్ణీత 20 ఓవర్లలో ఆరు వికెట్లు కోల్పోయి 168 పరుగులు చేసింది. ముంబై ఇండియన్స్‌కి ఓపెనర్లు శుభారంభాన్ని ఇచ్చినా... భారీ స్కోర్ సాధించలేకపోయారు... సూర్యకుమార్‌ యాదవ్ 38‌, ఎవిన్‌ లూయిస్‌ 60, హార్దిక్‌ పాండ్యా 36, ఇషాన్‌ కిషాన్‌ 12 పరుగులు తప్ప మిగతా ఆటగాళ్లు చెప్పుకోదగ్గ స్కోర్ చేయకపోవడంతో 168 పరుగులు చేసి... రాజస్థాన్ ముందు 169 పరుగుల టార్గెట్ పెట్టింది ముంబై...