గుత్తా జ్వాల పేరు ఎప్పుడో గల్లంతైంది..

గుత్తా జ్వాల పేరు ఎప్పుడో గల్లంతైంది..

బ్యాడ్మింటన్ క్రీడాకారిణి గుత్తా జ్వాల పేరు ఓటర్ల జాబితాలో గల్లంతైన వ్యవహారంపై ఎన్నిక ప్రధాన అధికారి రజత్ కుమార్ స్పందించారు. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ గుత్తా జ్వాల పేరు 2015 జాబితా నుంచి గల్లంతయిందని వెల్లడించారు. ఆమె పేరు ఓటర్ల జాబితాలో లేకపోవడంతో సంబంధిత ఎలక్టోరల్ రిజిస్ట్రేషన్ ఆఫీసర్ నుంచి నివేదిక కోరామని వివరించారు. 2019లో కొత్త జాబితా తయారు చేస్తామని స్పష్టం చేశారు. ఉదయం ఓటేసేందుకు వెళ్లిన గుత్తా జ్వాలకు.. ఓటు గల్లంతైన విషయాన్ని అధికారులు చెప్పడంతో ఆమె ట్విట్టర్ వేదికగా విమర్శలు గుప్పించారు. తనతో పాటు తన తండ్రి, సోదరి ఓటు కూడా గల్లంతైందని ఆవేదన వ్యక్తం చేశారు.