థియేటర్లో రజినీ కటౌట్ ముందే పెళ్లి !

థియేటర్లో రజినీ కటౌట్ ముందే పెళ్లి !

సాధారణంగా హీరోలకు అభిమానులుంటారు.  కానీ సూపర్ స్టార్ రజినీకి మాత్రం భక్తులుంటారు.  అలాంటి భక్తులు రజినీ పట్ల తమ అభిమానాన్ని చాటుకోడానికి కొన్ని క్రేజీ పనులు చేస్తుంటారు.  అలాంటి పనే చెన్నైలోని రాయపేటకు చెందిన అన్బరసు చేశాడు.  ఏకంగా తన పెళ్లిని నిన్న రజినీ కటౌట్ ముందు చేసుకున్నాడు.  రజినీ కొత్త చిత్రం 'పేట' ఆడుతున్న ఉడ్ ల్యాండ్ థియేటర్ కు తను ప్రేమించిన కామాక్షిని తీసుకెళ్లి రజినీ కటౌట్ ముందు కూర్చొని అభిమానులు, కుటుంబ సభ్యుల  నడుమ ఆమె మెడలో తాళి కట్టాడు.  పెళ్లి కుమార్తె కామాక్షి కూడ రజినీకి వీరాభిమాని కావడంతో అన్బరసు ఐడియాను తెగ ఎంజాయ్ చేసింది.