కుమార్తె పెళ్లి వేడుకలో రజనీ డ్యాన్స్ !

కుమార్తె పెళ్లి వేడుకలో రజనీ డ్యాన్స్ !

సూపర్ స్టార్ రజనీకాంత్ కుమార్తె సౌందర్య వివాహం నటుడు విశాగన్ తో జరుగుతోంది.  శుక్రవారం నుండి పెళ్లి వేడుకలు మొదలయ్యాయి.  మొదటి రిసెప్షన్ ఏర్పాటు చేయగా దానికి కొనసాగింపుగా సంగీత్ కార్యక్రమం కూడా జరిగింది.  ఈ కార్యక్రమంలో రజనీ కూడా హుషారుగా స్టెప్పులేశారు.  ముఖ్యంగా 'ముత్తు' సినిమా పాటలకు ఆయన వేసిన స్టెప్పులు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.  ఈ వేడుకలకు కొంతమంది కుటుంబసభ్యులు, సన్నిహితులు మాత్రమే హాజరవుతున్నారు.  సోమవారం ఉందయం వివాహం జరగనుంది.  కాగా సౌందర్యకు ఇది రెండవ వివాహం.  మొదటి భర్త అశ్విన్ తో విడాకుల తీసుకున్న ఆమెకు ఒక కుమారుడు ఉన్నాడు.