పెట్ట థియేటర్లోనే పెళ్లి చేసుకున్నాడు..!!

పెట్ట థియేటర్లోనే పెళ్లి చేసుకున్నాడు..!!

రజినీకాంత్ పెట్ట సినిమా నిన్న రిలీజ్ అయ్యింది.  మొదటి నుంచి పాజిటివ్ బజ్ ను క్రియేట్ చేసుకోవడంతో  పాటు రిలీజ్ తరువాత అదే టాక్ కంటిన్యూ కావడంతో తమిళనాడులో కలెక్షన్ల వర్షం కురుస్తోంది.  రజినీకాంత్ అభిమానులు ఏం చేసిన అది ఒక ట్రెండ్ గా మారుతుంది అనడంలో ఎలాంటి సందేశం లేదు.  పెట్ట సినిమా రిలీజ్ రోజున అన్బరసు అనే అభిమాని థియేటర్లోనే వివాహం చేసుకున్నాడు.  సినిమా రిలీజ్ సమయాన్ని ముహూర్తంగా ఫిక్స్ చేసుకొని ఈ వివాహం చేసుకున్నాడు.  

ఈ వివాహానికి రజినీకాంత్ అభిమానులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. అన్బరసు వివాహానికైన ఖర్చు మొత్తాన్ని అభిమానులే పెట్టుకోవడం విశేషం. రజినీపై ప్రత్యేక అభిమానం చాటుకున్న అన్బరసుకు భారీ ఎత్తున పెళ్లికానుకలు వచ్చాయి.  ఈ పెళ్లి ఇప్పుడు సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతుండటం విశేషం.