మహేష్ తరువాత అక్కడ రజినీకాంతే..!!

మహేష్ తరువాత అక్కడ రజినీకాంతే..!!

రజినీకాంత్ కు తమిళనాడుతో పాటు ప్రపంచవ్యాప్తంగా అభిమానులు ఉన్నారు.  రజిని నటించిన సినిమాలు ప్రపంచంలోని చాలా దేశాల్లో రిలీజ్ అవుతుంటాయి.  అమెరికాలో రజినీకాంత్ కు ఉన్న ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.  తాజాగా రజినీకాంత్ నటించిన పెట్ట సినిమా యూఎస్ లో భారీ ఎత్తున రిలీజ్ అయింది.  ఈ సినిమా ఫస్ట్ షో నుంచి హిట్ టాక్ ను సొంతం చేసుకుంది.  

థియేటర్లో రజినీకాంత్ ఇంట్రో సీన్ నుంచి ఎండింగ్ సీన్ వరకు ప్రేక్షకులు ఎంజాయ్ చేస్తున్నారు.  పెట్ట యూఎస్ లో $1మిలియన్ డాలర్లు వసూలు చేసి మరోసారి తన స్టామినాను నిరూపించుకున్నాడు.  మిలియన్ డాలర్లు వసూలు చేసిన రజినీకాంత్ సినిమాల్లో ఇది ఏడోది.  మహేష్ తరువాత యూఎస్ లో ఈ ఫీట్ సాధించిన హీరో రజినీకాంత్ కావడం విశేషం.  మహేష్ నటించిన 8 సినిమాలు యూఎస్ లో మిలియన్ డాలర్లు వసూలు చేశాయి.