రకుల్ మరీ ఇలా మారిందా..?

రకుల్ మరీ ఇలా మారిందా..?

వెంకటాద్రి ఎక్స్ ప్రెస్ తో తెలుగు తెరకు పరిచయమైన రకుల్ ప్రీత్ సింగ్ అనతికాలంలోనే స్టార్ హీరోలతో సినిమాలు చేసి అగ్రకథానాయికలతో పోటీ పడింది.  ఇలా తెలుగులో మంచి అవకాశాలు ఉన్న సమయంలో సడెన్ గా తెలుగు నుంచి దూరమైంది.   ఎందుకు తెలుగు నుంచి దూరమైందో అర్ధం కాలేదు.  ప్రస్తుతం తమిళంలో మాత్రం రెండు సినిమాల్లో నటిస్తోంది.  అదీ సూర్య, కార్తీ సినిమాల్లో.  ఈ ఇద్దరు హీరోలకు తెలుగులో మంచి మార్కెట్ ఉన్నది కాబట్టి ఆ రెండు సినిమాలు తెలుగులో రిలీజ్ కూడా రిలీజ్ అవుతాయి. 

తెలుగు నుంచి పక్కకు తప్పుకున్న ఈ పంజాబీ బ్యూటీ బాలీవుడ్లో ఎంట్రీ కోసం ప్రయత్నాలు చేస్తోన్నట్టు తెలుస్తోంది.  టాలీవుడ్ లో మెరుగ్గా రాణించిన తరాలకు బాలీవుడ్ లో అవకాశాలు దొరకడం ఈజీనే కానీ, రకుల్ కు మాత్రం ఆ అవకాశం ఇంకా దొరక్కపోవడం విశేషం.  అసలే బక్కపలచగా ఉండే రకుల్.. ఇటీవలే ఓ మ్యాగజైన్ కవర్ పేజీకి ఫోజులు ఇచ్చింది.  జీరోసైజ్ ప్యాక్ తో పూర్తి ఫిట్నెస్ గా ఉన్నట్టు కనిపించినా.. శరీరం మరింత పలచగా మారడంతో.. రకుల్ గ్లామర్ తగ్గిపోయినట్టుగా కనిపించింది.  బాలీవుడ్ లో అవకాశాల కోసం ఇలా జీరో ప్యాక్ లు సాధించడం వరకు ఓకే.  టాలీవుడ్ లోకి తిరిగి రావాలంటే.. ఇలా ఉంటె సరిపోదు.  తిరిగి రకుల్ తన పూర్వస్థితికి రావాల్సిందే.