ఒకటికాదు ఐదు వస్తున్నాయి..!!

ఒకటికాదు ఐదు వస్తున్నాయి..!!

రకుల్ ప్రీత్ సింగ్ మూడేళ్ళ క్రితం వరకు స్టార్ హీరోయిన్ గా టాలీవుడ్ లో ఓ వెలుగు వెలిగింది.  ఆ తరువాత క్రమంగా సినిమాలు తగ్గిపోవడం మొదలుపెట్టాయి.  ఇప్పుడు టాలీవుడ్ లో ఆమె చేయబోతున్న సినిమా ఒక్కటే ఉంది.  అదీ వెంకిమామ.  టాలీవుడ్ లో ఎందుకు అవకాశాలు తగ్గిపోతున్నాయని అడిగితే... టాలీవుడ్ లో తగ్గిపోయినా.. కోలీవుడ్, బాలీవుడ్ లో వరసగా అవకాశాలు వస్తున్నాయని, బహుశా.. ఈ కారణంగానే టాలీవుడ్ లో సినిమాలు చేయలేకపోతున్నట్టు చెప్పింది.  

ప్రస్తుతం కోలీవుడ్ లో మూడు సినిమాలు చేస్తున్నట్టు రకుల్ చెప్తోంది.  అటు బాలీవుడ్ లో కూడా రెండు చేస్తుందట.  ఈ ఏడాది తనవి కనీసం ఐదు సినిమాలు రిలీజ్ కాబోతున్నట్టు పేర్కొంది.  ఫిబ్రవరి 14 వ తేదీన కార్తీతో చేస్తున్న దేవ్ రిలీజ్ అవుతుంది.  ఈ సినిమా తరువాత వచ్చే వారం నుంచి రకుల్ వెంకిమామ సినిమా షూటింగ్ లో పాల్గొంటుంది.