పవన్ కు స‌ర్‌ప్రైజ్‌ ఇవ్వబోతున్న రామ్ చరణ్

పవన్ కు స‌ర్‌ప్రైజ్‌ ఇవ్వబోతున్న రామ్ చరణ్

మరో 24 గంటల్లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పుట్టినరోజు వేడుకలు జారబోతున్నాయి.  ఇప్పటికే పవన్ కళ్యాణ్ డీపీ ట్విట్టర్లో ట్రెండ్ అవుతున్నది.  పవన్ పుట్టినరోజు నాడు రామ్ చరణ్ ఓ సర్పైజ్ ఇవ్వబోతున్నాడు.  ఈ న్యూస్ ఇప్పటికే బయటకు వచ్చినా అధికారికంగా మాత్రం బయటకు రాలేదు.  రామ్ చరణ్ ట్విట్టర్ ద్వారా పవన్ కు బర్త్ డే గిఫ్ట్ ఇవ్వబోతున్నట్టు చెప్పడంతో ట్విట్టర్లో ఈ న్యూస్ ట్రెండ్ అవుతున్నది.  

మరో 24 గంటల్లో ఓ రామ్ చరణ్ ఓ వీడియోను రిలీజ్ చేయబోతున్నారట.  ప్రస్తుతం రామ్ చరణ్.. బోయపాటి సినిమా షూటింగ్ కోసం అజర్ బైజాన్ వెళ్లారు.  అక్కడే 30 రోజులపాటు కీలకమైన సన్నివేశాలను షూట్ చేయబోతున్నారు.  ప్రతి సంవత్సరం పవన్ కళ్యాణ్ పుట్టినరోజు నాడు పవన్ సినిమాకు సంబంధించి ఎదో ఒక న్యూస్ బయటకు వచ్చేది.  ఇప్పుడు పవన్ కళ్యాణ్ రాజకీయాల్లో బిజీగా ఉండటంతో పవన్ బర్త్ డే గిఫ్ట్ ను అబ్బాయి రూపంలో ఇవ్వబోతున్నాడు.  మరి ఆ గిఫ్ట్ ఏంటో తెలియాలంటే మరో 24 గంటలు ఆగాల్సిందే.