రామ్ చరణ్ భలే ప్లాన్ వేశాడు !

రామ్ చరణ్ భలే ప్లాన్ వేశాడు !

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ ప్రస్తుతం మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను దర్శకత్వంలో ఒక సినిమా చేస్తున్నాడు.  చరణ్ గత చిత్రం 'రంగస్థలం' ఇండస్ట్రీ హిట్ గా నిలవడంతో ఈ చిత్రంపై భారీ స్థాయి అంచనాలున్నాయి.  ఈ సినిమా యొక్క ఫస్ట్ లుక్ కోసం మెగా అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. 

ఫ్యాన్స్ అంచనాల్ని దృష్టిలో పెట్టుకుని చరణ్ ఫస్ట్ లుక్ విడుదలకు మంచి ప్లాన్ సెట్ చేశాడు.  అదేమిటంటే వచ్చే సెప్టెంబర్ 2న తన బాబాయ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సందర్బంగా ఫస్ట్ లుక్ ను రిలీజ్ చేయాలని చరణ్ భావిస్తున్నాడట.  ఈ వార్త బయటకు రాగానే అభిమానులంతా థ్రిల్ ఫీలై తెగ ఎంజాయ్ చేస్తున్నారు.  అయితే దీనిపై ఇంకా అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది.  కైరా అద్వానీ కథానాయకిగా నటిస్తున్న ఈ చిత్రాన్ని దానయ్య నిర్మిస్తున్నారు.