'సైరా' జార్జియా షెడ్యూల్ ఖర్చు ఎంతో తెలుసా ?

'సైరా' జార్జియా షెడ్యూల్ ఖర్చు ఎంతో తెలుసా ?

మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న 'సైరా' చిత్రాన్ని ఖర్చుకు వెనుకాడకుండా నిర్మిస్తున్నాడు రామ్ చరణ్.   ఈ చిత్రానికి సుమారు 200 కోట్ల రూపాయల బడ్జెట్ ను కేటాయించారు.  హైదరాబాద్లో వేసిన ప్రత్యేక సెట్లో కీలక సన్నివేశాల చిత్రీకరణను పూర్తిచేసిన యూనిట్ త్వరలో జార్జియా వెళ్లనున్నారు. 

అతి ముఖ్యమైన ఈ షెడ్యూల్ కోసం 50 కోట్ల రూపాయల పెద్ద మొత్తాన్ని ఖర్చు చేయనున్నారు.  40 రోజులపాటు ఈ షెడ్యూల్ జరగనుంది.  ఈ మధ్యే మెగాస్టార్ పుట్టినరోజు సందర్బంగా విడుదలైన ఈ చిత్ర టీజర్ బ్రహ్మాండంగా ఆకట్టుకోవడంతో సినిమాపై అంచనాలు తారా స్థాయికి చేరుకున్నాయి.  సురేందర్ రెడ్డి  దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమాలో అమితాబ్, విజయ్ సేతుపతి, నయనతార, తమన్నా, సుదీప్ వంటి స్టార్ నటీనటుల నటిస్తుండటం విశేషం.