చంద్రబాబుకు ఇప్పుడు నొప్పి తెలిసిందా..?

చంద్రబాబుకు ఇప్పుడు నొప్పి తెలిసిందా..?

ఏపీ అసెంబ్లీ స్పీకర్ కోడెల శివప్రసాదరావు ఒకప్పుడు పల్నాడు పులి అని.. ఇప్పుడు పల్నాడు పిల్లి అని సీపీఐ నేత రామకృష్ణ ఎద్దేవా చేశారు. ఇవాళ ఆయన విజయవాడలో మాట్లాడుతూ స్పీకర్ దిగజారి ప్రవర్తిస్తున్నారని.. అసెంబ్లీని బండెల దొడ్డి మాదిరి మార్చారని విమర్శించారు. బాబ్లీ కేసులో చంద్రబాబునాయుడుకు నోటీసుల జారీపై స్పందిస్తూ ప్రజా ఉద్యమాలు చేససినవుడు కేసులను ఏ ప్రభుత్వమైనా వెనక్కి తీసుకోవాలని రామకృష్ణ అభిప్రాయపడ్డారు. ఐతే.. తాము ఉద్యమాలు చేసినపుడు కూడా చంద్రబాబు జైల్లో పెట్టారని.. ఆయన మీదుకు వచ్చేసరికి నొప్పి తెలిసిందా అని ప్రశ్నించారు.