'సరదాకి వాకింగ్‌ చేసి పాదయాత్ర అంటారా?'

'సరదాకి వాకింగ్‌ చేసి పాదయాత్ర అంటారా?'

వైసీపీ అధినేత జగన్‌ సరదాకి చేసిన వాకింగ్‌ను కూడా పాదయాత్రగా ప్రచారం చేసుకుంటున్నారని టీడీపీ ఎంపీ రామ్మోహన్‌నాయుడు అన్నారు. ఇవాళ శ్రీకాకుళంలో ఆయన మాట్లాడుతూ జగన్‌ది నాలుగు రోజులు పాదయాత్ర.. మూడు రోజులు కోర్టు యాత్ర అని ఎద్దేవా చేశారు. అటువంటి దొంగపాదయాత్రలను ప్రజల నమ్మరని అన్నారు. తిత్లీ తుఫాన్‌ ధాటికి శ్రీకాకుళం అతలాకుతలమైనా పక్క జిల్లాలో ఉండి కూడా జగన్‌ పట్టించుకోలదేని అన్నారు. జగన్ ఇంకొక్కరోజు పాదయాత్ర చేసి ఉంటే ఇవాళ శ్రీకాకుళంలో నిర్వహించిన టీడీపీ సభకు వచ్చిన ప్రజాదరణ చూసి వెళ్లేవారని రామ్మోహన్‌ అన్నారు. తమ సభను చూసుంటే తిరుపతిలోనే రాజకీయ సన్యాసం చేసి..రామకోటి రాసుకునేవారని అన్నారు.