శైలజారెడ్డి కోసం రమ్యకృష్ణ ఎంత తీసుకుందో తెలుసా..?

శైలజారెడ్డి కోసం రమ్యకృష్ణ ఎంత తీసుకుందో తెలుసా..?

నాగచైతన్య హీరోగా వస్తున్న మారుతి దర్శకత్వంలో వస్తున్న సినిమా శైలజా రెడ్డి అల్లుడు.  ఈ సినిమాలో శైలజా రెడ్డిగా రమ్యకృష్ణ నటించింది.  నీలాంబరి, శివగామిని తరువాత అంతటి పవర్ ఫుల్ పాత్రలో రమ్యకృష్ణ నటిస్తున్నది.  ఆగష్టు 31 వ తేదీన ఈ సినిమా రిలీజ్ కాబోతున్నది.  ఇక ఈ సినిమాకు సంబంధించిన ఓ న్యూస్ మీడియాలో ట్రెండ్ అవుతున్నది.  

రమ్యకృష్ణ ఈ సినిమాకోసం ఎంత తీసుకుంది అనే విషయంపై మీడియాలో వార్తలు వస్తున్నాయి.  ఆమె కెరీర్లోనే భారీ మొత్తంలో అందుకున్నట్టు సమాచారం.  రమ్యకృష్ణ రోజుకు 6 లక్షలు వసూలు చేసిందట.  ఈ సినిమాకోసం రమ్యకృష్ణ 22 రోజులు పనిచేసింది.  ఈ లెక్కన చూసుకుంటే ఆమెకు కోటి పైగానే పారితోషికం అందింది.  ఇంపార్టెంట్ ఉన్న పాత్ర కావడంతో రమ్యకృష్ణ అడిగిన మొత్తాన్ని ఇచ్చేందుకు నిర్మాతలు ఏ మాత్రం సందేహించలేదట. ఆ పాత్రకు ఉన్న అంత ఇంపార్టెన్స్ ఏంటో తెలియాలంటే ఆగస్టు 31 వరకు ఆగాల్సిందే.