అంచనాలు పెంచుతున్న కేరాఫ్ కంచరపాలెం

అంచనాలు పెంచుతున్న కేరాఫ్ కంచరపాలెం

దగ్గుబాటి రానా సమర్పణలో సురేష్ ప్రొడక్షన్స్ పతాకంపై నిర్మిస్తున్న సినిమా కేరాఫ్ కంచరపాలెం.  వెంకటేష్ మహా దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమా ట్రైలర్ ఈరోజు రిలీజ్ అయింది.  ఈ సినిమా గురించి దగ్గుబాటి రానా ట్విట్టర్ లో ఆసక్తికరమైన ట్వీట్ చేశాడు.  ఈ ఏడాది చిన్న సినిమాగా వస్తున్న పెద్ద సినిమా ఇది పేర్కొన్నాడు.  ఈ ట్వీట్ ను బట్టి అర్ధం చేసుకోవచ్చు కేరాఫ్ కంచరపాలెం ఎలా ఉండబోతున్నదో.  ఇక్కడ మరో విశేషం ఏమంటే.. న్యూయార్క్ ఇండియన్ ఫిల్మ్ ఫెస్టివల్ కు ఎంపిక కావడంతో అంచనాలు మరింతగా పెరిగాయి.  

విశాఖ జిలాల్లోని కంచరపాలెం అనే గ్రామంలో నలుగురి జీవితాల చుట్టూ తిరిగే కథ ఇది.  నాలుగు ప్రేమ కథలకు సంబంధించిన కథ.  తక్కువ బడ్జెట్ తో నిర్మించిన ఈ సినిమా తప్పకుండా ప్రతి ఒక్కరిని ఆకట్టుకుంటుందనే ఆశాభావాన్ని వ్యక్తం చేస్తున్నారు దర్శక నిర్మాతలు.  సెప్టెంబర్ 7 న సినిమా విడుదల కాబోతున్నది