అమెరికాలో బిచ్చమెత్తిన సంజు  

అమెరికాలో బిచ్చమెత్తిన సంజు  

సంజయ్‌ దత్‌ బయోపిక్‌ కోసం అభిమానులు ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు. తెరపై కన్పించిన సంజయ్‌ వేరు. నిజ జీవితంలోని సంజయ్‌ వేరు. అయితే ఈ సినిమాకు సంబంధించి రోజుకో కొత్త పోస్టర్‌ను హిరాణీ విడుదల చేస్తున్నారు. తాజాగా విడుదల చేసిన పోస్టర్‌లో రణ్‌బీర్‌ రోడ్లపై బిచ్చమెత్తుకున్నారు. మాదకద్రవ్యాలకు అలవాటుపడిన సంజయ్‌..... చికిత్స కోసం అమెరికా వెళ్లారు. ఓసారి అక్కడి రిహాబ్‌ సెంటర్‌ నుంచి సంజయ్‌ పారిపోయాడు. తన స్నేహితుల ఇళ్లకు వెళ్లడానికి అక్కడి రోడ్లపై డబ్బుల కోసం బిచ్చమెత్తుకున్నట్లు పోస్టర్‌పై రాసుంది. ఈ పోస్టర్‌ను హిరాణీ ట్విటర్‌ ద్వారా విడుదల చేశారు. 'సంజు జీవిత ప్రయాణం ఎన్నో ఒడుదొడుకులతో కూడుకున్నది. కొన్ని విషయాలు మీరు నమ్మలేని విధంగా ఉంటాయి. సంజు కథ తెలిస్తే నమ్మలేరు కానీ ఇది నిజం' అని ట్వీట్‌ ద్వార తెలిపారు. 'సంజు' చిత్రంలో సంజయ్‌ తల్లి నర్గిస్‌ పాత్రలో మనీశా కోయిరాలా, తండ్రి సంజయ్‌ దత్‌ పాత్రలో పరేశ్‌ రావల్‌ నటించారు.  జూన్‌ 29న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది.