'ఎన్టీఆర్' సినిమాకు గుమ్మడికాయ కొట్టేశారు

'ఎన్టీఆర్'  సినిమాకు గుమ్మడికాయ కొట్టేశారు

జూనియర్ ఎన్టీఆర్ కు టర్నింగ్ పాయింట్ ఇచ్చిన సినిమా ఏది అంటే.. టెంపర్ అనే చెప్తారు.  టెంపర్ కు ముందు హిట్స్ వచ్చినా .. చాలా ప్లాప్ లు వచ్చాయి.  పూరీ జగన్నాథ్ తో చేసిన టెంపర్ సినిమా బంపర్ హిట్ అయింది.  అప్పటి నుంచి వరసగా సినిమాలు హిట్ అవుతూనే ఉన్నాయి.  టెంపర్ సినిమాలో ఎన్టీఆర్ నటన హైపిచ్ లో ఉంటుంది.  హై ఆటిట్యూడ్ తో ఉన్న ఈ సినిమాను ఇప్పుడు హిందీలో రీమేక్ చేస్తున్న సంగతి తెలిసిందే.  

రోహిత్ శెట్టి దర్శకత్వంలో రణ్వీర్ సింగ్ హీరోగా ఈ సినిమా తెరకెక్కతున్నది.  ఈ సినిమాకు సంబంధించిన అప్డేట్ బయటకు వచ్చింది.  సీంమ్బా సినిమా గోవా షెడ్యూల్ తో పూర్తయింది.  నిన్ననే సినిమాకు గుమ్మడికాయ కొట్టేశారు.  త్వరలోనే ఈ సినిమాకు సంబంధించిన పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ మొదలవుతాయట.  డిసెంబర్ 21 న సినిమాను రిలీజ్ చేస్తున్నారు.  రణ్వీర్ సింగ్, సారా అలీఖాన్ జంటగా నటించిన ఈ సినిమాను ధర్మ ప్రొడక్షన్స్ లో కరణ్ జోహార్ నిర్మిస్తున్నారు.