'రేజర్ ఫోన్ 2' విడుదల

'రేజర్ ఫోన్ 2' విడుదల

ప్రముఖ మొబైల్స్ తయారీదారు 'రేజర్' తన నూతన స్మార్ట్‌ఫోన్ 'రేజర్ ఫోన్ 2' ను విడుదల చేసింది. బుధవారం అమెరికా, కెనడా, యూకే, యూరప్ మార్కెట్‌లలో రేజర్ ఫోన్ 2ను విడుదల చేసింది. అతిత్వరలో ఇతర దేశాల్లోనూ ఆందుబాటులోకి రానుంది. 8 జీబీ ర్యామ్.. 64 జీబీ స్టోరేజీ గల ఫోన్ ధర రూ.74,500లుగా ఉంది. ఒకవారం తర్వాత ఇటలీలో ఈ ఫోన్ ప్రీ బుకింగ్స్ ప్రారంభమవుతాయి. యూస్ లో మాత్రం స్టార్టింగ్ ధర రూ.50,800లుగా ఉంది. ఐపీ 67 వాటర్, డస్ట్ రెసిస్టెన్స్ వంటి ప్రత్యేకతను కలిగి ఉంది.

ఫీచర్లు:

# 5.72 ఇంచ్ క్వాడ్ హెచ్‌డీ డిస్‌ప్లే
# 2560 x 1440 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్ 
# స్నాప్‌డ్రాగన్ 845 ప్రాసెసర్‌
# ఆండ్రాయిడ్ 8.1 ఓరియో
# 8 జీబీ ర్యామ్.. 64 జీబీ స్టోరేజ్
# 12 మెగాపిక్సల్ డ్యుయల్ కెమెరాలు 
# 8 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా
# 4000 ఎంఏహెచ్ బ్యాటరీ
# ఫింగర్ ప్రింట్ సెన్సార్ 
# గొరిల్లా గ్లాస్ 5 ప్రొటెక్షన్