రియ‌ల్ మి సి1 (2019) విడుద‌ల‌

రియ‌ల్ మి సి1 (2019) విడుద‌ల‌

చైనాకు చెందిన మొబైల్ తయారీదారు 'ఒప్పో' స‌బ్‌బ్రాండ్ 'రియల్ మి' నుంచి రియ‌ల్ మి సి1 (2019) స్మార్ట్‌ఫోన్ విడుద‌లైంది. ఫిబ్ర‌వరి 5న మ‌ధ్యాహ్నం 12 గంట‌ల నుంచి ఫ్లిప్‌కార్ట్ లో విక్రయించ‌నున్నారు. రియ‌ల్ మి సి1 (2019) స్మార్ట్‌ఫోన్ ఓషియ‌న్ బ్లూ, డీప్ బ్లాక్ క‌ల‌ర్ ఆప్ష‌న్ల‌లో లభించనుంది. 2జీబీ ర్యామ్, 32 జీబీ స్టోరేజ్ వేరియెంట్‌ను రూ.7,499 ధ‌ర‌కు.. 3జీబీ ర్యామ్, 32 జీబీ స్టోరేజ్ వేరియెంట్‌ రూ.8,499 ధ‌ర‌కు వినియోగదారులకు అందుబాటులో ఉంది. ఈ ఫోన్‌లో ఫేస్ అన్‌లాక్ ఫీచ‌ర్‌ ఉంది.

ఫీచ‌ర్లు:

# 6.2 ఇంచ్ హెచ్‌డీ ప్ల‌స్ డిస్‌ప్లే
#  1520 x 720 పిక్స‌ల్స్ స్క్రీన్ రిజ‌ల్యూష‌న్‌
#  1.8 గిగాహెడ్జ్ ఆక్టాకోర్ స్నాప్‌డ్రాగ‌న్ 450 ప్రాసెస‌ర్‌
# ఆండ్రాయిడ్ 8.1 ఓరియో
# 2/3 జీబీ ర్యామ్‌, 32 జీబీ స్టోరేజ్‌(256 జీబీ ఎక్స్‌పాండ‌బుల్ స్టోరేజ్‌)
#  13, 2 మెగాపిక్స‌ల్ డ్యుయ‌ల్ బ్యాక్ కెమెరాలు
# 5 మెగాపిక్స‌ల్ సెల్ఫీ కెమెరా
# 4,230 ఎంఏహెచ్ బ్యాట‌రీ
# ఫేస్ అన్‌లాక్ ఫీచ‌ర్‌