'ఎన్టీఆర్' నుంచి తేజ తప్పుకొన్నది ఇందుకే..

'ఎన్టీఆర్' నుంచి తేజ తప్పుకొన్నది ఇందుకే..

ఎన్టీఆర్ బ‌యోపిక్.. ప్రేక్షకులతోపాటు ఇండ‌స్ట్రీ మొత్తం ఆస‌క్తిగా ఎదురుచూస్తోంది. అన్నగారి జీవితాన్ని తెరపైకి ఎక్కించేందుకు బాలకృష్ణ ముందుగా దర్శకుడు తేజను ఎంపిక చేశారు. ఆ తర్వాత ఆయన స్థానంతో క్రిష్‌ వచ్చి చేరారు. ఇందుకు కారణమేంటనే విషయమై రకరకాల రూమర్స్‌ వినిపించాయి. ఐతే..అసలు కారణమేంటో బాలయ్య స్వయంగా చెప్పారు. తేజ దర్శకత్వంలోనే షూటింగ్‌ మొదలుపెట్టామని.. కానీ... 'ఇంత బరువు మోయలేను' అని ఆయన సతమతమయ్యారని చెప్పారు. 

ఇదే విషయం విద్యాబాలన్‌కి ముంబై వెళ్లిన సమయంలో దర్శకుడు క్రిష్‌ వచ్చి కలిశారని బాలయ్య చెప్పారు. తేజ తప్పుకొన్న విషయం క్రిష్‌కు తెలిసి.. 'బాబూ.. నేను డైరెక్ట్‌ చేయనా..?' అని తనను అడిగారని ఆయన చెప్పారు. క్రిష్‌ అడిగిన రెండే నిమిషాల్లో నిర్ణయం తీసేసుకున్నానన్నారు.  ఓ దశలో ఈ  చిత్రానికి తాను దర్శకత్వం వహిద్దామనుకున్నానని చెప్పారు బాలయ్య.