తారక్ అందుకే హాజరు కాలేదు..!

తారక్ అందుకే హాజరు కాలేదు..!

నందమూరి ఫ్యామిలీకి సంబంధించిన ఏ చిన్న విషయమైన సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతుంది.  బాలకృష్ణకు.. హరికృష్ణ ఫ్యామిలీకి ఇప్పటికే దూరం పెరిగింది.  ఇక ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్ సినిమాల వేడుకలకు ఎవరు హాజరు కాకపోయినా ఇద్దరి మధ్య పొసగడంలేదని.. అందుకే దూరంగా ఉంటున్నారని రూమర్లు వస్తుంటాయి.  

ఎమ్ఎల్ఏ ఆడియో వేడుకకు ఎన్టీఆర్ హాజరు కాకపోవడంతో సోషల్ మీడియాలో రూమర్లు వెళ్లాయి.  దీంతో ఎన్టీఆర్ కళ్యాణ్ రామ్ కొత్త సినిమా ఓపెనింగ్ కు హాజరయ్యి వివాదం సద్దుమణిగే విధంగా చూశారు.  ఇటీవల కళ్యాణ్ రామ్ నా నువ్వే ఆడియో వేడుకకు ఎన్టీఆర్ హాజరు కాలేదు.  దీంతో సోషల్ మీడియాలో మరలా రూమర్లు ప్రారంభమయ్యాయి.  

దీంతో ఎన్టీఆర్ ఎందుకు హాజరు కాలేదో వివరణ ఇచ్చుకోవలసి వచ్చింది.  హరికృష్ణకు దగ్గరి బంధువైన విశాఖ దేవీఫుడ్స్ సంస్థ అధినేత ఇంట్లో జరుగుతున్న వివాహానికి ఎన్టీఆర్ హాజరు కావాల్సి వచ్చింది.  హరికృష్ణ ఆరోగ్యం సహకరించకపోవడంతో.. తండ్రి స్థానంలో ఎన్టీఆర్ హాజరయ్యాడు.  నా నువ్వే ఆడియో వేడుకకు వద్దామని అనుకున్నా సడెన్ గా వివాహానికి హాజరు కావాల్సి వచ్చిందని అందుకే నా నువ్వే ఆడియో వేడుకకు ఎన్టీఆర్ హాజరు కాలేకపోయారని సన్నిహితులు చెప్పుకొచ్చారు.