రోహిత్‌ ఖాతాలో ఆ 2 రికార్డులు

రోహిత్‌ ఖాతాలో ఆ 2 రికార్డులు

టీమిండియా స్టార్‌ బ్యాట్స్‌మన్‌ రోహిత్‌శర్మ.. వరుసపెట్టి రికార్డులను కొల్లగొడుతున్నాడు.  ఇవాళ న్యూజిలాండ్‌తో జరిగిన రెండో టీ20లో  అర్ధ సెంచరీ  చేసిన రోహిత్.. టీ20ల్లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా రికార్డులకెక్కాడు. 

టీ20ల్లో ఇప్పటి వరకూ న్యూజిలాండ్‌కి చెందిన ఓపెనర్ మార్టిన్ గప్తిల్ 2,263 పరుగులతో అగ్రస్థానంలో ఉండగా.. 2,288 పరుగులతో రోహిత్ శర్మ అగ్రస్థానానికి ఎగబాకాడు. 2,263 పరుగులతో పాకిస్థాన్ మిడిలార్డర్ బ్యాట్స్‌మెన్ షోయబ్ మాలిక్ మూడో స్థానంలో ఉన్నాడు. కోహ్లీ 2,167 పరుగులతో భారత్ తరఫున రెండో స్థానంలో ఉన్నాడు. 

 టీ20ల్లో అత్యధిక అర్ధ సెంచరీలు చేసిన రికార్డును కూడా రోహిత్‌ ఇవాళ్టి మ్యచ్‌తో సొంతం చేసుకున్నాడు. ఇవాళ్టి అర్ధ సెంచరీతో రోహిత్‌ ఈ జాబితాలో ప్రథమ స్థానానికి చేరుకోగా..మొత్తం 19 అర్ధ సెంచరీలతో కోహ్లీ రెండో స్థానంలో కొనసాగుతున్నాడు. 16 అర్ధ సెంచరీలతో మార్టిన్ గప్తిల్, 15 అర్ధ సెంచరీలతో క్రిస్‌గేల్, మెకల్లమ్, 14 హాఫ్ సెంచరీలతో తిలక్‌రత్నే దిల్షాన్ తరువాతి స్థానాల్లో ఉన్నారు.