48 మెగాపిక్సల్ కెమెరాతో రెడ్‌మి స్మార్ట్‌ఫోన్

48 మెగాపిక్సల్ కెమెరాతో రెడ్‌మి స్మార్ట్‌ఫోన్

చైనాకు చెందిన ప్రముఖ మొబైల్ సంస్థ 'షియోమీ‌' సరికొత్త రెడ్‌మి స్మార్ట్‌ఫోన్‌ను విడుదల చేయనుంది. జనవరి 10న 48 మెగాపిక్సెల్ కెమెరా గల సరికొత్త రెడ్‌మి స్మార్ట్‌ఫోన్‌ను చైనా మార్కెట్‌లోకి తీసుకొస్తోంది. తాజాగా ఈ ఫోన్ టీజర్‌ను షావోమి సీఈవో లీ జున్ పోస్ట్ చేశారు. ఈ ఫోన్ ధర సుమారు రూ. 1,02,300లుగా ఉండనుంది. అయితే ఈ ఫోన్ రెడ్‌మి నోట్ 7, రెడ్‌మి 7 లేదా రెడ్‌మి నోట్ ప్రో 2 స్మార్ట్‌ఫోన్ లాగా ఉండే అవకాశం ఉంది. 'షియోమీ‌ ప్లే' స్మార్ట్‌ఫోన్‌ లాగ కూడా ఉండవచ్చు అని ఊహిస్తున్నారు. రెడ్‌మి స్మార్ట్‌ఫోన్‌ బ్లాక్, ఎక్స్ బ్లూ, పింక్ రంగుల్లో లభించనుంది. ఈ ఫోన్ 'రెడ్‌మి ఎక్స్' పేరుతో విడుదల అవనుందని సమాచారం.

ఫీచర్లు:

# 6.3 ఇంచ్ ఫుల్‌హెచ్‌డీ డిస్‌ప్లే
# 660 ఆక్టాకోర్ ఎస్ఓసి ప్రాసెసర్
# ఆండ్రాయిడ్ 9.0 ఫై 
# 48 మెగాపిక్సల్ కెమెరా
# 6 జీబీ ర్యామ్
# 4000 ఎంఏహెచ్ బ్యాటరీ
# వాటర్ డ్రాప్ నాచ్