'జియో' మరింత అదనపు డేటా...

'జియో' మరింత అదనపు డేటా...

అన్ని ఉచితమంటూ టెలికం రంగంలో అడుగుపెడుతూనే సంచలనం సృష్టించిన రిలయన్స్ జియో...  ఆ తర్వాత టారీఫ్ ప్లాన్లను అమలు చేసినా ఎప్పటికప్పుడు తమ యూజర్లకు సరికొత్త ఆఫర్లను అందిస్తూనే ఉంది. ఇతర టెలికం సంస్థలకు కొరకరాని కొయ్యగామారిన జియో... తాజాగా మరో ఆఫర్‌ను తీసుకొచ్చింది. రూ.149 నుంచి రూ. 799 శ్రేణిలో గల అన్ని ప్రీ పెయిడ్‌ ప్లాన్లపై తమ వినియోగదారులకు అదనంగా 1.5 జీబీ డేటాను అందిస్తోంది. ఇప్పటి వరకు రూ.149, రూ. 349, రూ. 399, రూ. 449 ప్యాక్‌లపై తన యూజర్లకు రోజుకు 1.5 జీబీ డేటా అందిస్తుండగా... ఇక కొత్త ఆఫర్‌ ద్వారా రోజుకు 3 జీబీ డేటా వాడుకోవచ్చు. 2 జీబీ, 3 జీబీ, 4 జీబీ, 5 జీబీ డేటా ప్యాక్‌లపై కూడా అదనంగా రోజుకు 1.5 జీబీ డేటా అందిస్తోంది జియో. ఇక ఆఫర్లను బట్టి కాలపరిమితి మారుతుండగా... అన్ని ప్యాక్‌లపై డేటాకి తోడు, అన్‌లిమిటెడ్ కాల్స్, 100 ఎస్‌ఎంఎస్‌లను ఉచితంగా అందిస్తోంది జియో. మరోవైపు మైజియో యాప్ ద్వారా రూ.300... ఆపై రీచార్జ్‌ చేసుకునే వినియోగదారులకు రూ.100 డిస్కౌంట్ ఇస్తోంది.