దర్శకురాలిగా మారనున్న రేణు దేశాయ్ !

 దర్శకురాలిగా మారనున్న రేణు దేశాయ్ !

పవన్ నుండి విడిపోయాక చాలా కాలం తర్వాత ఈ మధ్యే మరొక పెళ్లి చేసుకుని ఇప్పుడిప్పుడే కొత్త జీవితాన్ని ప్రారంభిస్తున్న రేణు దేశాయ్ త్వరలో ఒక తెలుగు సినిమాను డైరెక్ట్ చేయనున్నారు.  ఈ మధ్యే ఒక ఇంగ్లీష్ పత్రికతో మాట్లాడిన ఆమె స్క్రిప్ట్ పని పూర్తైందని, త్వరలోనే సినిమాను మొదలుపెడతామని అన్నారట.  

రైతుల సమస్యల చుట్టూ తిరిగే ఈ సినిమా కోసం రేణు దేశాయ్ కొంతమంది రైతుల్ని కలిసి వారి బాధల్ని నేరుగా తెలుసుకోనున్నారట. అంతేకాదు ఈ చిత్రాన్ని స్వయంగా ఆమే నిర్మించనున్నారు.  ఇక ఈ చిత్రంలో నటీనటులెవరనేది ఇంకా తెలియాల్సి ఉంది.  రేణు దేశాయ్ గతంలో 'ఇష్క్ వాలా లవ్' అనే మరాఠీ చిత్రాన్ని డైరెక్ట్ చేశారు.