రేవంత్‌రెడ్డి కేసు వాయిదా..

రేవంత్‌రెడ్డి కేసు వాయిదా..

కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి కేసును మరోసారి వాయిదా వేసింది తెలంగాణ హైకోర్టు. అసెంబ్లీ ఎన్నికల సమయంలో తన నివాసంలోకి వచ్చి పోలీసులు అక్రమంగా అరెస్ట్ చేశారని గతంలో హైకోర్టును ఆశ్రయించారు రేవంత్ రెడ్డి... దీనిపై కోర్టుకు హాజరై వివరణ ఇచ్చారు తెలంగాణ డీజీపీ. అక్రమ అరెస్ట్ పై ప్రభుత్వంకు జరిమానా విధిస్తామని వ్యాఖ్యానించింది హైకోర్టు. ఈ కేసులో మరిన్ని వివరాలు సమర్పిస్తామని హైకోర్టును గడువు కోరింది తెలంగాణ ప్రభుత్వం... దీంతో కేసు విచారణను ఈ నెల 25కు వాయిదా వేసింది హైకోర్టు.