ప్రజలను మభ్యపెట్టి అధికారంలోకి వచ్చారు

ప్రజలను మభ్యపెట్టి అధికారంలోకి వచ్చారు

బంగారు తెలంగాణగా మారుస్తానని కేసీఆర్ ప్రజలను మభ్యపెట్టి, మాయ చేసి అధికారంలోకి వచ్చారని టీ కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి ఆరోపించారు. నిజామాబాద్ లో ఆయన మాట్లాడుతూ, కేసీఆర్ మాటలు విని నిజామాబాద్ ప్రజలు టీఆర్ఎస్ కు అండగా నిలిచారన్నారు. జిల్లాలో మొత్తం తొమ్మిది స్థానాలను గెలిపించారు. కాని నిజామాబాద్ జిల్లాను సీఎం కేసీఆర్, ఎంపీ కవిత ఎటువంటి అభివృద్ధి చేయలేదు. టీఆర్ఎస్ పాలనలో ఆత్మహత్యలు తగ్గలేదు. ఎన్నికల హామీలేవి అమలు కాలేదు. రుణమాపీ కాదు గిట్టుబాటు కూడా ఇవ్వలేదు. పసుపు బోర్డు, సెజ్ హామీ ఎక్కడ పోయిందో చెప్పాలి. అర్ధాంతరంగా ఎందుకు అసెంబ్లీని రద్దు చేశారో ప్రజలకు చెప్పాలి. కేసిఆర్ ది  నియంత పోకడ. ప్రగతిభవన్ లో పేద ప్రజలకు అమరవీరుల కుటుంబాలకు కూడా ప్రవేశం లేకుండా నిషేదం విధించారు. న్యాయం కోసం కోర్టు తలుపుతడితే అసెంబ్లీని రద్దు చేస్తారా. నాలుగు కోట్ల ప్రజల పక్షాన వకాల్తా పుచ్చుకొని కాంగ్రెస్ పార్టీ ఎన్నికల బరిలో దిగుతుంది. కేసిఆర్ కుటుంబంలోని నలుగురు దోపిడీ దారులు ఒక వైపు నాలుగు కోట్ల ప్రజలు మరోవైపుగా కురుక్షేత్ర యుద్దం జరగబోతుంది. అని రేవంత్ రెడ్డి తెలిపారు.