హరీష్‌ను కలిశాకే కాంగ్రెస్‌లో చేరిన నర్సారెడ్డి...!

హరీష్‌ను కలిశాకే కాంగ్రెస్‌లో చేరిన నర్సారెడ్డి...!

గత నెల 25 తేదీన హరీష్‌రావుతో చర్చలు జరిపిన తర్వాతే మరుసటి రోజు ఢిల్లీ వెళ్లిన గజ్వేల్ నర్సారెడ్డి... కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు రాహుల్ గాంధీ సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారంటూ సంచలన ఆరోపణలు చేశారు తెలంగాణ కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్‌రెడ్డి. ఈ నెల 25వ తేదీ నాడు మంత్రుల నివాస ప్రాంగణం సీసీటీవీ ఫుటేజ్ బయటపెట్టాలని డిమాండ్ చేసిన ఆయన... ఇది బయటకు వస్తుందనే మీ బావ హరీష్‌రావు... తన కారు డ్రైవర్‌ను మార్చే ప్రయత్నాల్లో ఉన్నారంటూ కేటీఆర్‌కు సూచించారు. ఏ క్షణమైన టీఆర్ఎస్ కుండ పగిలే అవకాశం ఉంది... ఏ క్షణంలోనైనా టీఆర్ఎస్‌లో విస్ఫోటనం జరిగే అవకాశం ఉందని సంచలన వ్యాఖ్యలు చేసిన రేవంత్... ఇక మాది సీల్డ్ కవర్ ముఖ్యమంత్రి అయితే... మీ సీఎం చీప్ లిక్కర్ సీఎం అని కేటీఆర్ గుర్తించాలని వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల ఎంపిక ప్రక్రియకు తెలంగాణ ప్రజలకు ఆమోదం ఉందన్నారు.