ఎన్టీఆర్, లక్ష్మీ పార్వతిల రహస్య బంధం ఏంటి ?

ఎన్టీఆర్, లక్ష్మీ పార్వతిల రహస్య బంధం ఏంటి ?

 

'లక్ష్మీస్ ఎన్టీఆర్' పేరుతో సినిమా మొదలుపెట్టి అనేక సంచలనాలకు కారణమయ్యాడు రామ్ గోపాల్  వర్మ.  ఇన్నాళ్లు పాటలు, పోస్టర్లతో వేడి పుట్టించిన ఆయన ఫిబ్రవరి 14 ప్రేమికుల రోజు సందర్బంగా ట్రైలర్ రిలీజ్ చేయనున్నాడు.  ఇందులో లక్ష్మీ పార్వతి కోసం సర్వం వదిలేసుకున్న రామారావుని చూస్తారని అన్నారు.  అసలు ఎన్టీఆర్, లక్ష్మీ పార్వతిల మధ్య ఉన్న రహస్య సంబంధం ఏమిటనేది చెబుతారట.  వెలుగులు పంచిన వ్యక్తి చుట్టూ అలుముకున్న చీకట్లు ఏంటనేది వివరిస్తాడట. 

ఈ ట్రైలర్ చాలామందికి నొప్పి కలిగించవచ్చని, ఎందుకంటే అది కత్తుల్లాంటి నిజాలతో నిండి ఉంటుందని, ఈ కథ తెలుగు తెరపై ఆటం బాంబులను పేలుస్తుందని అంటున్నారు.  మరి వర్మ చెప్పినట్టు ఆ ఆటం బాంబులు, కత్తులు ఏమిటి తెలియాలంటే 14 వరకు వేచి చూడాల్సిందే.