ముఖ్యమంత్రి రాకముందే రిబ్బన్ కట్

ముఖ్యమంత్రి రాకముందే రిబ్బన్ కట్

పార్టీల పంచాయతీయే ముందుకొచ్చినప్పుడు పవర్లో ఉన్నవారి ప్రయారిటీని ఎవరడిగారు? ఇంతకీ విషయమేంటంటే.. మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ఓ మెడికల్ కాలేజీని ప్రారంభించేందుకు షెడ్యూల్ ఖరారైంది. అధికారులు ఆ ఏర్పాట్లలో మునిగి ఉండగానే.. కాంగ్రెస్ ఎంపీ కాంతిలాల్ భూరియా ఆదరాబాదరాగా వెళ్లి మెడికల్ కాలేజీని ప్రారంభించేశాడు. సొంతంగా ఓ పంతులు, ఇతర మందీ మార్బలాన్ని వెంటేసుకొని హడావుడిగా ఓపెన్ చేశాడు. అదేమంటే.. ఈ మెడికల్ కాలేజీ యూపీఏ హయాంలోనే అప్రూవ్ అయింది.. పైగా మంగళవారం మంచిరోజు.. అందుకే ఆలస్యం కాకుండా ప్రారంభం చేశాను.. అని చెప్పుకున్నాడు. 

ఈ విషయం తెలిసిన మధ్యప్రదేశ్ అధికారులు కంగుతిన్నారు. వెంటనే అక్కడికి చేరుకొని ఎంపీ భూరియాతో పాటు మరికొందరి మీద కేసులు పెట్టారు. ఆ తరువాత అనుకున్న షెడ్యూల్ ప్రకారం ఎంపీ శివరాజ్ సింగ్ చౌహాన్ లాంఛనంగా కాలేజీని ప్రారంభించారు. ఇది రట్లమ్-ఝబువా లోక్ సభ నియోజకవర్గంలో జరిగింది.