రిషబ్‌ రికార్డుల హోరు..

రిషబ్‌ రికార్డుల హోరు..

కెన్నింగ్టన్ ఓవెల్ వేదికగా ఇంగ్లండ్‌తో జరుగుతున్న ఐదో టెస్ట్ రెండో ఇన్నింగ్స్‌లో సూపర్‌ సెంచరీ చేసిన టీమిండియా కీపర్ రిషబ్ పంత్ రికార్డులు తిరగరాస్తున్నాడు. 

  • భారత వికెట్‌ కీపర్లలో నాలుగో ఇన్నింగ్స్‌లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా పంత్‌ రికార్డు సృష్టించాడు. 2007లో ధోనీ ఇంగ్లాండ్‌పై 76 నాటౌట్‌, పార్థివ్‌ పటేల్‌ ఇంగ్లాండ్‌పై 67 నాటౌట్‌, దీప్‌ దాస్‌ గుప్తా దక్షిణాఫ్రికాపై 63 రికార్డును పంత్‌ అధిగమించాడు. 
  • టెస్టుల్లో ఆసియా వెలుపల సెంచరీలు సాధించిన భారత వికెట్ కీపర్ల జాబితాలో పంత్ చేరాడు. 1959లో వెస్టిండీస్‌లో విజయ్ మంజ్రేకర్ ఈ ఫీట్ సాధించిన తొలి భారత వికెట్‌ కీపర్‌. 2002లో వెస్టిండీస్‌లో అజయ్ రాత్రా సెంచరీ సాధించాడు.  2012లో వెస్టిండీస్‌లో వృద్ధిమాన్ సాహా శతకం బాదాడు.
  • చిన్న వయస్సులోనే టెస్టుల్లో సెంచరీ సాధించిన వికెట్‌ కీపర్ల జాబితాలో పంత్ రెండో స్థానంలో ఉన్నాడు.