వైరల్ వీడియో: భారత్ ఆర్మీ పాటకు పంత్ డాన్స్

వైరల్ వీడియో: భారత్ ఆర్మీ పాటకు పంత్ డాన్స్

భారత క్రికెట్ జట్టులోకి కొత్తగా వచ్చిన వికెట్ కీపర్-బ్యాట్స్ మెన్ కి అప్పుడే విపరీతంగా ఫ్యాన్ ఫాలోయింగ్ పెరిగిపోతోంది. వికెట్ల వెనక తన కీపింగ్, బ్యాటింగ్ తోనే కాకుండా మాటకు మాట అన్నట్టు పంత్ స్లెడ్జింగ్ కి మారుపేరైన ఆస్ట్రేలియా జట్టుకే రెచ్చగొట్టే మాటలు రువ్వి చుక్కలు చూపించడం అభిమానులకు బాగా నచ్చుతోంది. ఇటీవల ముగిసిన టెస్ట్ సిరీస్ మూడో టెస్టులో ఆస్ట్రేలియా జట్టు కెప్టెన్, వికెట్ కీపరైన టిమ్ పైన్ స్లెడ్జింగ్ చేస్తే పంత్ దానికి ధీటుగా కౌంటర్లు వేయడం భారత క్రికెట్ జట్టు అభిమానులైన భారత్ ఆర్మీకి తెగ నచ్చేసింది. దీంతో వాళ్లు పంత్ పై ఏకంగా పాటే రాశారు. 

ఆస్ట్రేలియాపై చారిత్రక టెస్ట్ సిరీస్ విజయం తర్వాత పంత్ భారత్ ఆర్మీ తనపై రాసిన ‘వి హేవ్ గాట్ పంత్’ పాటకు ధన్యవాదాలు తెలిపాడు. మ్యాచ్ తర్వాత జట్టు వేడుకల్లో భాగంగా ఆ పాటలకు చిందులేశాడు. ఆ వీడియోని భారత్ ఆర్మీ తన ట్విట్టర్ అకౌంట్ లో పోస్ట్ చేసింది. 

మెల్బోర్న్ టెస్ట్ తర్వాత తను అన్న మాటలన్నీ ఆటలో అరటిపండు అన్నట్టు పంత్ టిమ్ పైన్ భార్య బానీ, పిల్లలతో కలిసి ఫోటో తీయించుకున్నాడు. బానీ కూడా తన ఇన్ స్టాగ్రామ్ లో ఆ ఫోటో పెడుతూ ‘బెస్ట్ బేబీ సిట్టర్’ అని పేర్కొంది.