రిషబ్ పంత్ నయా రికార్డు...

రిషబ్ పంత్ నయా రికార్డు...

ఢిల్లీలో ఫిరోజ్‌ షా కోట్ల మైదానంలో సన్ రైజర్స్ హైదరాబాద్, ఢిల్లీ డేర్ డెవిల్స్ మధ్య జరిగిన మ్యాచ్‌లో ఢిల్లీ వికెట్ కీపర్ తన బ్యాటింగ్‌తో నయా రికార్డు సృష్టించాడు. సిక్సర్లు, బౌండరీలతో హైదరాబాద్ బౌలర్లపై విరుచుకుపడిన పంత్... కేవలం 63 బంతుల్లోనే ఏడు సిక్సర్లు, 15 ఫోర్లతో చెలరేగిపోయాడు... ఆది నుంచి పరుగుల వేటలతో తడబడిన ఢిల్లీకి 128 పరుగుల చేసిన పంత్ నాటౌట్‌గా నిలవడంతో ఆ జట్టు 187 పరుగులు చేసి... హైదరాబాద్‌ ముందు 188 పరుగుల భారీ టార్గెట్ పెట్టింది. 

ఇక రిషబ్ పంత్ ఐపీఎల్‌లో కొత్త రికార్డులు సృష్టించాడు... ఐపీఎల్ చరిత్రలో అత్యంత పిన్న వయసులో శతకం బాదిన రెండో ఆటగాడిగా రికార్డుకెక్కాడు. 2009లో మనీశ్‌ పాండే 19 ఏళ్ల 253 రోజుల్లో సెంచరీ నమోదు చేయగా... పంత్‌ 20 ఏళ్ల 218 రోజుల్లో ఈ ఘనత సాధించాడు. ఇక ఐపీఎల్ కెరీర్‌లో రిషబ్ పంత్‌కి ఇదే తొలి సెంచరీ కాగా... ఈ ఐపీఎల్ సీజన్‌లో ఇది మూడో సెంచరీ. ఇప్పటికే క్రిస్‌గేల్, షేన్ వాట్సన్ సెంచరీలు బాదేయగా... పంత్ మూడో సెంచరీ చేసిన రికార్డు సొంతం చేసుకున్నాడు. అంతే కాదు ఐపీఎల్‌లో వేగంగా వెయ్యి పరుగులు పూర్తి చేసిన అతిపిన్న వయస్సు కలిగిన క్రికెటర్ కూడా పంత్ కావడం విశేషం.