ఘోర రోడ్డు ప్రమాదంలో నలుగురు మృతి

ఘోర రోడ్డు ప్రమాదంలో నలుగురు మృతి

ఘోర రోడ్డు ప్రమాదంలో నలుగురు మృతి చెందారు. ఈ ఘటన హైదరాబాద్ నగర శివారు నార్సింగ్ లో చోటుచేసుకుంది. మితిమీరిన వేగంతో దూసుకు వచ్చిన‌ క్రషర్ వాహనం ఎదురుగా వున్న కరెంటు స్తంభంతో పాటు టాటాఎస్ వాహనాన్ని ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో నలుగురు అక్కడికక్కడే మృతి చెందారు. ఈ ఘటనతో రహదారి మొత్తం రక్తసిక్తమైంది. చనిపోయిన వారిలో ఇద్దరిని వట్టినాగుల పల్లికి చెందిన హేమంత్ రెడ్డి, అనిల్ గా పోలీసులు గుర్తించారు.