నిద్రిస్తున్న కుక్కపై రోడ్డేశారు 

నిద్రిస్తున్న కుక్కపై రోడ్డేశారు 

ఆర్ పీ ఇన్ ఫ్రా వెంచర్ ప్రైవేట్ లిమిటెట్ వర్కర్ల నిర్లక్ష్యానికి పరాకాష్టా ఈ ఘటన. నిద్రిస్తున్న వీధి కుక్కపై గమనించకుండా రోడ్డు వేశారు. హృదయ విదారకమైన ఈ ఘటన ఆగ్రాలోని ఫతేబాద్‌లో జరిగింది. వేడి వేడి తారుతో కుక్కపై రోడ్డు వేయటంతో అది చనిపోయింది. దీనికి సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతోంది. 

తాజ్‌మహల్, పరిసర ప్రాంతాల్లో తారు రోడ్డు వేస్తున్నారు. రోడ్డుకు చివరన ఓ శునకం ఆదమరచి నిద్రపోతుంది. దాన్ని అక్కడి నుంచి తరమడమో లేదా పక్కకు తీసుకెళ్లడమో చేయకుండా అలాగే పొగలుకక్కుతున్న తారును దాని మీద పోశారు. అంతే అది అక్కడికక్కడే ప్రాణాలు వదిలింది. ఘటనకు కారకులైన వారిపై చర్య తీసుకోవాలని స్థానికులు  ఆందోళనకు దిగారు. సగం రోడ్డు కింద నలిగిపోయిన శునకం ఫొటో సామాజిక మాధ్యమాల్లో కనిపించడంతో నెటిజన్లు, హక్కుల కార్యకర్తలు దానిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.