చివరికి న్యాయమే గెలుస్తుంది: రాబర్ట్ వాద్రా

చివరికి న్యాయమే గెలుస్తుంది: రాబర్ట్ వాద్రా

ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ తనను ప్రశ్నించిన ఉదంతంపై కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ భర్త రాబర్ట్ వాద్రా స్పందించారు. చివరికి సత్యమే గెలుస్తుందని వ్యాఖ్యానించారు. దేశవ్యాప్తంగా తనకు మద్దతుగా నిలిచిన స్నేహితులు, మద్దతుదారులకు ధన్యవాదాలు, తాను ధైర్యంగా, క్రమశిక్షణతో దేన్నైనా ఎదుర్కొంటాను. అని వాద్రా ఫేస్‌బుక్‌ పోస్ట్‌లో తెలిపారు. తనకు విదేశాల్లో ఎలాంటి అక్రమాస్తులు లేవని, రాజకీయ కక్ష సాధింపుతోనే తనపై దాడులు చేస్తున్నారని వాద్రా ఆరోపించారు.

మనీల్యాండరింగ్‌ కేసులో వాద్రాను ఈనెల బుధ, గురు వారాల్లో విచారించిన ఈడీ శనివారం మరోసారి సుదీర్ఘంగా ప్రశ్నించింది. వాద్రా లండన్‌లో వరుసగా 5 మిలియన్‌ పౌండ్లు, 4 మిలియన్‌ పౌండ్ల విలువ
చేసే రెండు ఇళ్లను, ఆరు ఫ్లాట్స్‌, ఇతర ఆస్తులను కొనుగోలు చేశారని, వీటిలో కొత్తగా చేజిక్కించుకున్న ఆస్తులు సైతం ఉన్నాయని ఈడీ ఢిల్లీ కోర్టుకు నివేదించిన సంగతి తెలిసిందే.