రాక్ లాగే రఫ్ఫాడిస్తా..

రాక్ లాగే రఫ్ఫాడిస్తా..

డబ్ల్యూడబ్ల్యూఎఫ్ లో వాల్డ్ ఫేమస్ ఫైటర్ రాక్ గురించి తెలియనివారుండరు. రింగ్ ను ఓ ఊపు ఊపిన డ్వాయన్ జాన్సన్.. ఆ తరువాత హాలీవుడ్ సినిమాల్లో అద్భుతంగా రాణించాడు. ఇప్పుడాయన 17 ఏళ్ల కూతురు సైమన్ జాన్సన్ కూడా తండ్రి అడుగు జాడల్లో నడవాలని నిర్ణయించుకుంది. ఇందుకోసం ఓర్లాండోలో పార్ట్ టైమ్ కోచింగ్ తీసుకుంటోంది. వీరి కుటుంబం నుంచి సైమన్ కూడా రింగులోకి దిగితే వరుసగా నాలుగో తరం కూడా ఫైటర్స్ వారసత్వాన్ని కొనసాగించినట్టు అవుతుంది.