న్యాయం చేయాలని అత్తగారింటి ముందు కోడలు ధర్నా

న్యాయం చేయాలని అత్తగారింటి ముందు కోడలు ధర్నా

తనకు, తన బిడ్డకు న్యాయం చేయాలని ఓ కోడలు తన అత్తగారింటి ముందు ధర్నాకు దిగింది. ఈ ఘటన హైదరాబాద్ చైతన్య పురి పోలీసు స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. ప్రేమ పెళ్లి చేసకుని సొంత అత్తకొడుకు తమకు అన్యాయం చేశారంటూ రోజా అనే మహిళ అవేదన వ్యక్తం వ్యక్తం చేస్తోంది. తనకు తన బిడ్డకు అన్యాయం చేశారని.. తమకు న్యాయం చేయాలంటూ లక్ష్మీ నగర్ కాలనీ లోని భర్త భరత్ తల్లిదండ్రుల ఇంటి వద్ద మహిళా సంఘాల సహాయంతో రోజా దర్నాకు దిగింది. చైతన్యపురి పోలీసులు రోజాను, ఆమెకు మద్దతు ఇచ్చిన మహిళా సంఘాలను పోలీసు స్టేషన్ కు తరలించారు.