రెండున్నర కోట్ల కుల్లినన్‌

రెండున్నర కోట్ల కుల్లినన్‌

బ్రిటన్‌ బేస్‌డ్ లగ్జరీ కార్ల తయారీ కంపెనీ రోల్స్ రాయిస్ తన మొట్టమొదటి ఎస్‌యూవీ వెహికల్‌ను లాంచ్ చేసింది... ఈ కారు ధరను $ 325,000 డాలర్లుగా ఫిక్స్ చేయగా... ఇప్పటి వరకు ప్రపంచంలో కనుగొన్న అతిపెద్ద వజ్రం ' కుల్లినన్‌' పేరును ఈ కారుకు పెట్టారు. ప్రపంచంలోని అత్యంత ప్రతిష్టాత్మకమైన, విలాసవంతమైన కారల్లో ఒకటిగా ఉంది. రోల్స్ రాయిస్ 'కుల్లినన్‌'... ఆర్కిటెక్చర్ ఆఫ్ లగ్జరీ అనే ఫ్లాట్‌ఫామ్‌లో తీర్చదిద్దిన రెండవ కారు. దీనిలో 6.75 లీటర్ల టర్బో వీ 12 ఇంజీన్‌, 563 బీహెచ్‌పీ పవర్, 850 ఎన్‌ఎం, 627ఎల్‌బీ టార్క్‌ను ప్రొడ్యూస్ చేస్తుంది. ఇండియన్ కరెన్సీలో దీని విలువ సుమారు రూ. 2.35 కోట్లు.

కుల్లినన్ దాని సమీప పోటీదారు అయిన బెంటైగా కంటే నాలుగు అంగుళాలు ఎత్తు, ఆరు అడుగుల గ్రౌండ్ కలిగి ఉంది. బెంటైగా కంటే 500 పౌండ్ల బరువు కూడా ఉంది. రోల్స్ రాయిస్ కుల్లినన్ కోసం ఒక కొత్త, చిన్న, మందమైన స్టీరింగ్ వీల్ తయారు చేశారు. అధిక-రిజల్యూషన్, హెడ్స్-అప్ డిస్ప్లే మరియు కుటుంబంలో అంచనా వేయబడిన అన్ని టెక్నాలజీలతో దీనిని అనుసంధానించారు. పగలు, రాత్రి వన్యప్రాణి హెచ్చరికలు, పాదచారుల హెచ్చరిక చేస్తోంది. విస్తృత వీక్షణ, హెలికాప్టర్ వీక్షణతో నాలుగు వైపులా కెమెరా పార్కింగ్ వ్యవస్థ ఉంది. క్రాష్‌ను తట్టుకునే వ్యవస్థతో పాటు... అనే అత్యాధునిక టెక్నాలజీని దీనికి అనుసంధానం చేశారు.