ఆర్ఆర్ఆర్ ఫస్ట్ లుక్ ఎప్పుడంటే..!!

ఆర్ఆర్ఆర్ ఫస్ట్ లుక్ ఎప్పుడంటే..!!

రాజమౌళి ఆర్ఆర్ఆర్ సినిమా షూటింగ్ శెరవేగంగా జరుగుతున్నది. రామ్ చరణ్, ఎన్టీఆర్ లు మల్టీస్టారర్ గా ఈ సినిమా తెరకెక్కుతోంది.  ప్రస్తుతం రామ్ చరణ్ కు సంబంధించిన సీన్స్ ను ఆర్ఎఫ్సి లో షూట్ చేస్తున్నారు.  డివివి దానయ్య నిర్మిస్తున్న ఈ సినిమాకు సంబంధించిన ఓ ఆసక్తికరమైన న్యూస్ బయటకు వచ్చింది.  

ఆర్ఆర్ఆర్ సినిమా ఫస్ట్ లుక్ రిలీజ్ కు సంబంధించిన న్యూస్ అది.  ఆర్ఆర్ఆర్ ఫస్ట్ లుక్ ను మార్చి 27 వ తేదీన రామ్ చరణ్ బర్త్ డే సందర్భంగా రిలీజ్ చేస్తున్నారని సమాచారం.  అందుకే సెకండ్ షెడ్యూల్ ను రామ్ చరణ్ పై ఫోకస్ చేసి షూట్ చేస్తున్నారట.  కీరవాణి సంగీతం అందిస్తున్న ఈ సినిమాను వచ్చే ఏడాది సమ్మర్ స్పెషల్ గా రిలీజ్ చేయబోతున్నారు.