'ఆర్ఆర్ఆర్' షూట్ చాలా స్పీడు గురూ !

'ఆర్ఆర్ఆర్' షూట్ చాలా స్పీడు గురూ !

రాజమౌళి సినిమా అంటే చిత్రీకరణకు బోలెడంత సమయం పడుతుందనేది అందరికి తెలిసిన సంగతే.  ప్రతి సన్నివేశాన్ని చెక్కినట్టు తీసే ఆయన తొందరెందుకు, టైమ్ తీసుకుందాం అంటూ పనిచేస్త్తారు.  కానీ ఇప్పుడు చేస్తున్న 'ఆర్ఆర్ఆర్' మూవీ విషయంలో మాత్రం చాలా స్పీడుగా ఉన్నాడు జక్కన్న. 

కొద్దిరోజుల క్రితమే చరణ్, ఎన్టీఆర్ లతో మొదటి షెడ్యూల్ మొదలుపెట్టి ఈరోజుటితో ముగించేశారు.  ఈ అప్డేట్ చూసిన ప్రేక్షకులంతా సినిమా మొత్తం ఆయన ఇదే స్పీడ్ కొనసాగిస్తే 2020లో కాదు 2019లోనే సినిమాను థియేటర్లలో దించేయవచ్చని అంటున్నారు.