వికారాబాద్ జిల్లాలో ఆర్టీసీ బస్సు బోల్తా

వికారాబాద్ జిల్లాలో ఆర్టీసీ బస్సు బోల్తా

వికారాబాద్ జిల్లా నవాబ్ పేట మండలం నాగిరెడ్డిపల్లి గేటు వద్ద ఆర్టీసీ బస్సు బోల్తా పడింది. ఈ ఘటనలో 15 మంది ప్రయాణికులకు తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే క్షతగాత్రులను వికారాబాద్ ప్రభుత్వాసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. బస్సు బోల్తా ఘటనపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.