చమురు ఉత్పత్తి తగ్గించడం కష్టం: రష్యా

చమురు ఉత్పత్తి తగ్గించడం కష్టం: రష్యా

శీతాకాలంలో చమురు ఉత్పత్తిని తగ్గించడం కష్టమని రష్యా స్పష్టం చేసింది. గడ్డ కట్టించే చలి వాతావరణం కారణంగా రష్యాలో చమురు క్షేత్రాలలో చమురు ఉత్పత్తిని  మిగతా ఉత్పత్తిదారుల కంటే తగ్గించుకోవడం సాధ్యం కాదని రష్యా ఇంధన మంత్రి అలెగ్జాండర్ నొవాక్ గురువారం స్పష్టం చేశారు. ఉత్పత్తి తగ్గించుకొనేందుకు తాము సిద్ధమని చమురు ఉత్పత్తి దేశాల సంస్థ, ఒపెక్ ప్రకటించింది. అయితే రష్యా కూడా చమురు ఉత్పత్తిని తగ్గించాలని షరతు విధించింది. ‘ఇంతకు ముందే చెప్పినట్టుగా.. మా వాతావరణ పరిస్థితుల రీత్యా మిగతా దేశాలకు మాదిరిగా ఉత్పత్తి తగ్గించుకోవడం మాకు ఎంతో కష్టమైన పని. మా చమురు ఉత్పత్తి రంగానికి ఉన్న కీలక లక్షణం అదేనని‘ నొవాక్ తెలిపారు.