జూన్‌ 2 నుంచి రైతు బీమా

జూన్‌ 2 నుంచి రైతు బీమా

రాష్ట్రంలో రైతులకు రూ.5 లక్షల ప్రమాద బీమా పథకాన్ని తెలంగాణ ఆవిర్భావ దినమైన జూన్ 2 నుంచి అమలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. గతంలో ఏప్రిల్ నుంచి అమలు చేయాలని భావించగా.. తాజాగా ఈ మార్పు చేశారు. ఈమేరకు ఇప్పటికే రైతు బీమా అమలుపై ఎల్‌ఐసీ సంస్థ ప్రతినిధులు, వ్యవసాయశాఖ అధికారులతో ప్రభుత్వం నిర్ణయించింది. రైతుల తరఫున ప్రీమియం రాష్ట్ర ప్రభుత్వమే చెల్లించనుంది.