రైతు సమన్వయ సమితి సభ్యులకూ అవకాశం..

రైతు సమన్వయ సమితి సభ్యులకూ అవకాశం..

తెలంగాణలో గ్రామపంచాయతీ ఎన్నికలకు చురుకుగా ఏర్పాట్లు జరుగుతున్నాయి... అయితే ప్రభుత్వం నియమించిన రైతు సమన్వయ సమితి సభ్యులు స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేయవచ్చా? లేదా? అనే దానిపై అయోమయం నెలకొనగా... దీనిపై ఇవాళ రాష్ట్ర ఎన్నికల సంఘం స్పష్టత ఇచ్చింది. రైతు సమన్వయ సమితి సభ్యులు కూడా స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీచేయొచ్చని స్పష్టం చేసింది. అయితే, రాష్ట్ర వ్యాప్తంగా మూడు విడుతలుగా పంచాయతీ ఎన్నికలు నిర్వహించనుండగా... మొదటి విడత నామినేషన్ల దాఖలు సమయం ముగిసిన తరువాత ఈ నిర్ణయాన్ని ప్రకటించింది ఈసీ.