మళ్లీ మైదానంలోకి శ్రీశాంత్‌..

మళ్లీ మైదానంలోకి శ్రీశాంత్‌..

స్పాట్‌ ఫిక్సింగ్‌ ఆరోపణలతో బీసీసీఐ బ్యాన్‌ను ఎదుర్కొంటున్న స్పీడ్‌స్టర్‌ శ్రీశాంత్‌ మళ్లీ మైదానంలో అడుగుపెట్టాడు. చాలా ఏళ్ల నుంచి ఆటకు దూరంగా ఉన్న ఈ ఫాస్ట్‌ బౌలర్‌.. క్రికెట్‌కు వీడ్కోలు పలికినట్లే అనుకుంటున్న తరుణంలో మళ్లీ బంతి పట్టాడు. ఏదో క్లబ్‌ తరఫున బౌలింగ్‌, బ్యాటింగ్‌ చేస్తున్న ఫోటోలు, వీడియోలను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్‌ చేశాడు. ఏ క్లబ్‌.. ఏ టోర్నీ అనేది మాత్రం తెలియకపోయినప్పటికీ.. ఈ ఫొటోలు నెట్టింట్లో వైరల్‌గా మారాయి. బీసీసీఐ బ్యాన్‌ ఎత్తివేసినా, ఫిట్‌నెస్‌ ఉన్నా.. 35 ఏళ్ల  శ్రీశాంత్ జాతీయ జట్టులోకి రీ ఎంట్రీ ఇచ్చే అవకాశాలు అతితక్కువగానే ఉన్నాయి. కానీ.. విదేశాల్లో జరిగే టీ20 టోర్నీల్లో ఆడేందుకు మాత్రం అవకాశముంటుంది. 

 

#discipline #Cricket

A post shared by Sree Santh (@sreesanthnair36) on