అజిత్ విశ్వాసం షూటింగ్ లో అపశృతి

అజిత్ విశ్వాసం షూటింగ్ లో అపశృతి

తలా అజిత్ విశ్వాసం షూటింగ్ లో అపశృతి చోటు చేసుకున్నది.  ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ పూణేలో జరుగుతున్న సంగతి తెలిసిందే.  పూణేలో ఓ భారీ సెట్ వేసి సాంగ్ షూట్ చేస్తున్నారు.  ఇలా సాంగ్ షూట్ చేస్తుండగా.. డ్యాన్సర్లలో ఒకరు హఠాత్తుగా గుండెపోటుతో కుప్పకూలిపోయారు.  ఈ హఠాత్ పరిణామానికి యూనిట్ అంతా షాక్ తిన్నది.  వెంటనే మరణించిన డ్యాన్సర్ మృతదేహాన్ని పూణే నుంచి చెన్నైకు తరలించేందుకు అజిత్ ఏర్పాట్లు చేశారు.  దీనికోసం అజిత్ ఓ ప్రైవేట్ ఫ్లైట్ ను ఏర్పాటు చేశారు.  

డ్యాన్సర్ అంత్యక్రియలకు కావాల్సిన ఏర్పాట్లతో పాటు అతని కుటుంబానికి రూ.8 లక్షల రూపాయల సహాయాన్ని అందించారు.  ఈ విషయం సోషల్ మీడియాలో లీక్ కావడంతో, అజిత్ చేసిన సహాయాన్ని అందరు మెచ్చుకుంటున్నారు.